caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-An'aam, ఆయత్ 50

మక్కా · అవతరణ క్రమం 55 · 6:50

قُل لَّآ أَقُولُ لَكُمْ عِندِى خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعْلَمُ ٱلْغَيْبَ وَلَآ أَقُولُ لَكُمْ إِنِّى مَلَكٌ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَىَّ قُلْ هَلْ يَسْتَوِى ٱلْأَعْمَىٰ وَٱلْبَصِيرُ أَفَلَا تَتَفَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను[1]. వారిని ఇలా అడుగు: "ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?"
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70