وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا كُلَّ ذِى ظُفُرٍ وَمِنَ ٱلْبَقَرِ وَٱلْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَآ أَوِ ٱلْحَوَايَآ أَوْ مَا ٱخْتَلَطَ بِعَظْمٍ ذَٰلِكَ جَزَيْنَٰهُم بِبَغْيِهِمْ وَإِنَّا لَصَٰدِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad"మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము[1]. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము!"