وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ جَنَّٰتٍ مَّعْرُوشَٰتٍ وَغَيْرَ مَعْرُوشَٰتٍ وَٱلنَّخْلَ وَٱلزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُۥ وَٱلزَّيْتُونَ وَٱلرُّمَّانَ مُتَشَٰبِهًا وَغَيْرَ مُتَشَٰبِهٍ كُلُوا۟ مِن ثَمَرِهِۦٓ إِذَآ أَثْمَرَ وَءَاتُوا۟ حَقَّهُۥ يَوْمَ حَصَادِهِۦ وَلَا تُسْرِفُوٓا۟ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْرِفِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే పందిళ్ళ మీద ప్రాకే (ఎక్కించబడే) తీగలు మరియు పందిళ్ళ మీద ప్రాకని (ఎక్కించబడని) చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచి గల పంటలు మరియు జైతూన్ (ఆలివ్), దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు[1]. వాటికి ఫలాలు వచ్చినపుడు వాటి ఫలాలను తినండి. కానీ వాటి కోత దినమున (ఫలకాలంలో) వాటి హక్కు (జకాత్) చెల్లించండి[2]. మరియు వృథాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా, ఆయన వృథా ఖర్చు చేసే వారంటే ఇష్టపడడు.