caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 157

మదీనా · అవతరణ క్రమం 92 · 4:157

وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا ٱلْمَسِيحَ عِيسَى ٱبْنَ مَرْيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمْ وَإِنَّ ٱلَّذِينَ ٱخْتَلَفُوا۟ فِيهِ لَفِى شَكٍّ مِّنْهُ مَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّ وَمَا قَتَلُوهُ يَقِينًۢا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు.[1] మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు.[2] నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70