caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 135

మదీనా · అవతరణ క్రమం 92 · 4:135

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُونُوا۟ قَوَّٰمِينَ بِٱلْقِسْطِ شُهَدَآءَ لِلَّهِ وَلَوْ عَلَىٰٓ أَنفُسِكُمْ أَوِ ٱلْوَٰلِدَيْنِ وَٱلْأَقْرَبِينَ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَٱللَّهُ أَوْلَىٰ بِهِمَا فَلَا تَتَّبِعُوا۟ ٱلْهَوَىٰٓ أَن تَعْدِلُوا۟ وَإِن تَلْوُۥٓا۟ أَوْ تُعْرِضُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు.[1] మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70