caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Kahf, ఆయత్ 21

మక్కా · అవతరణ క్రమం 69 · 18:21

وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوٓا۟ أَنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَأَنَّ ٱلسَّاعَةَ لَا رَيْبَ فِيهَآ إِذْ يَتَنَٰزَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ فَقَالُوا۟ ٱبْنُوا۟ عَلَيْهِم بُنْيَٰنًا رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ قَالَ ٱلَّذِينَ غَلَبُوا۟ عَلَىٰٓ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని చివరి ఘడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహవాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: "వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి." వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: "వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70