caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Yunus, ఆయత్ 22

మక్కా · అవతరణ క్రమం 51 · 10:22

هُوَ ٱلَّذِى يُسَيِّرُكُمْ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ حَتَّىٰٓ إِذَا كُنتُمْ فِى ٱلْفُلْكِ وَجَرَيْنَ بِهِم بِرِيحٍ طَيِّبَةٍ وَفَرِحُوا۟ بِهَا جَآءَتْهَا رِيحٌ عَاصِفٌ وَجَآءَهُمُ ٱلْمَوْجُ مِن كُلِّ مَكَانٍ وَظَنُّوٓا۟ أَنَّهُمْ أُحِيطَ بِهِمْ دَعَوُا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ لَئِنْ أَنجَيْتَنَا مِنْ هَٰذِهِۦ لَنَكُونَنَّ مِنَ ٱلشَّٰكِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము!"[1]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70