وَقَطَّعْنَٰهُمُ ٱثْنَتَىْ عَشْرَةَ أَسْبَاطًا أُمَمًا وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ إِذِ ٱسْتَسْقَىٰهُ قَوْمُهُۥٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْحَجَرَ فَٱنۢبَجَسَتْ مِنْهُ ٱثْنَتَا عَشْرَةَ عَيْنًا قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ وَظَلَّلْنَا عَلَيْهِمُ ٱلْغَمَٰمَ وَأَنزَلْنَا عَلَيْهِمُ ٱلْمَنَّ وَٱلسَّلْوَىٰ كُلُوا۟ مِن طَيِّبَٰتِ مَا رَزَقْنَٰكُمْ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము వారిని పన్నెండు తెగలుగా (వర్గాలుగా) విభవించాము.[1] మరియు మూసా జాతి వారు అతనిని నీటి కొరకు అడిగినపుడు, మేము అతనిని: "నీ చేతికర్రతో రాయిపై కొట్టు!" అని ఆజ్ఞాపించాము. అపుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. అపుడు ప్రతి తెగవారు, తాము నీళ్ళు తీసుకునే స్థలాన్ని తెలుసుకున్నారు. మరియు మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. మరియు వారి కొరకు మన్న మరియు సల్వాలను దింపాము:[2] "మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి." అని అన్నాము. మరియు వారు మాకు అన్యాయం చేయలేదు, కాని తమకు తామే అన్యాయం చేసుకున్నారు.