caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-A'raaf, ఆయత్ 143

మక్కా · అవతరణ క్రమం 39 · 7:143

وَلَمَّا جَآءَ مُوسَىٰ لِمِيقَٰتِنَا وَكَلَّمَهُۥ رَبُّهُۥ قَالَ رَبِّ أَرِنِىٓ أَنظُرْ إِلَيْكَ قَالَ لَن تَرَىٰنِى وَلَٰكِنِ ٱنظُرْ إِلَى ٱلْجَبَلِ فَإِنِ ٱسْتَقَرَّ مَكَانَهُۥ فَسَوْفَ تَرَىٰنِى فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُۥ لِلْجَبَلِ جَعَلَهُۥ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا فَلَمَّآ أَفَاقَ قَالَ سُبْحَٰنَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا۠ أَوَّلُ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మూసా మేము నిర్ణయించిన సమయానికి (మా నిర్ణీత చోటుకు) వచ్చినపుడు, అతని ప్రభువు అతనితో మాట్లాడాడు. (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నీ దర్శన భాగ్యమివ్వు (కనిపించు). నేను నిన్ను చూడదలచాను!" (అల్లాహ్) అన్నాడు: "నీవు నన్ను (ఏ మాత్రం) చూడలేవు! కాని ఈ పర్వతం వైపుకు చూడు! ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే, అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో!" [1] అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది భస్మమై పోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత (మూసా) అన్నాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలు తున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటి వాడను." [2]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70