لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِٱلْبَيِّنَٰتِ وَأَنزَلْنَا مَعَهُمُ ٱلْكِتَٰبَ وَٱلْمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلْقِسْطِ وَأَنزَلْنَا ٱلْحَدِيدَ فِيهِ بَأْسٌ شَدِيدٌ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَلِيَعْلَمَ ٱللَّهُ مَن يَنصُرُهُۥ وَرُسُلَهُۥ بِٱلْغَيْبِ إِنَّ ٱللَّهَ قَوِىٌّ عَزِيزٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము.[1] మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము మరియు ఇనుమును కూడా ప్రసాదించాము. అందులో గొప్ప శక్తి ఉంది, మరియు మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.[2] మరియు (ఇదంతా) అల్లాహ్ అగోచరుడైన తనకు మరియు తన ప్రవక్తలకు ఎవడు సహాయకుడవుతాడో చూడటానికి చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహా బలశాలి, సర్వశక్తిమంతుడు.