وَلَا تُؤْتُوا۟ ٱلسُّفَهَآءَ أَمْوَٰلَكُمُ ٱلَّتِى جَعَلَ ٱللَّهُ لَكُمْ قِيَٰمًا وَٱرْزُقُوهُمْ فِيهَا وَٱكْسُوهُمْ وَقُولُوا۟ لَهُمْ قَوْلًا مَّعْرُوفًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి.[1] దాని నుండి వారికి అన్న వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి.