caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 34

మదీనా · అవతరణ క్రమం 92 · 4:34

ٱلرِّجَالُ قَوَّٰمُونَ عَلَى ٱلنِّسَآءِ بِمَا فَضَّلَ ٱللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَآ أَنفَقُوا۟ مِنْ أَمْوَٰلِهِمْ فَٱلصَّٰلِحَٰتُ قَٰنِتَٰتٌ حَٰفِظَٰتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ ٱللَّهُ وَٱلَّٰتِى تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَٱهْجُرُوهُنَّ فِى ٱلْمَضَاجِعِ وَٱضْرِبُوهُنَّ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا۟ عَلَيْهِنَّ سَبِيلًا إِنَّ ٱللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadపురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్)[1], ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి[2]. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు[3].
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70