caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Noor, ఆయత్ 58

మదీనా · అవతరణ క్రమం 102 · 24:58

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لِيَسْتَـْٔذِنكُمُ ٱلَّذِينَ مَلَكَتْ أَيْمَٰنُكُمْ وَٱلَّذِينَ لَمْ يَبْلُغُوا۟ ٱلْحُلُمَ مِنكُمْ ثَلَٰثَ مَرَّٰتٍ مِّن قَبْلِ صَلَوٰةِ ٱلْفَجْرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ ٱلظَّهِيرَةِ وَمِنۢ بَعْدِ صَلَوٰةِ ٱلْعِشَآءِ ثَلَٰثُ عَوْرَٰتٍ لَّكُمْ لَيْسَ عَلَيْكُمْ وَلَا عَلَيْهِمْ جُنَاحٌۢ بَعْدَهُنَّ طَوَّٰفُونَ عَلَيْكُم بَعْضُكُمْ عَلَىٰ بَعْضٍ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلْـَٔايَٰتِ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70