caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Baqara, ఆయత్ 248

మదీనా · అవతరణ క్రమం 87 · 2:248

وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ ءَايَةَ مُلْكِهِۦٓ أَن يَأْتِيَكُمُ ٱلتَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ ءَالُ مُوسَىٰ وَءَالُ هَٰرُونَ تَحْمِلُهُ ٱلْمَلَٰٓئِكَةُ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారితో వారి ప్రవక్త (సామ్యూల్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, అతని ఆధిపత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వకాలంలో ఆ పెట్టె (తాబూత్) మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి, మనశ్శాంతి లభిస్తుంది. మరియు అందులో మూసా సంతతి మరియు హారూన్ సంతతి వారు వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు, దేవదూతల ద్వారా మీకు లభిస్తాయి. మీరు విశ్వసించిన వారే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది."
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70