لَقَدْ كَانَ فِى قَصَصِهِمْ عِبْرَةٌ لِّأُو۟لِى ٱلْأَلْبَٰبِ مَا كَانَ حَدِيثًا يُفْتَرَىٰ وَلَٰكِن تَصْدِيقَ ٱلَّذِى بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلِّ شَىْءٍ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి వారి గాథలలో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇది (ఈ ఖుర్ఆన్) కల్పితగాథ కాదు. కాని ఇది ఇంత వరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి వున్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించేవారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను.