وَٱعْلَمُوٓا۟ أَنَّمَا غَنِمْتُم مِّن شَىْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُۥ وَلِلرَّسُولِ وَلِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَٰمَىٰ وَٱلْمَسَٰكِينِ وَٱبْنِ ٱلسَّبِيلِ إِن كُنتُمْ ءَامَنتُم بِٱللَّهِ وَمَآ أَنزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ ٱلْفُرْقَانِ يَوْمَ ٱلْتَقَى ٱلْجَمْعَانِ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీ విజయధనంలో[1] నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి[2] మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[3]