بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَسْـَٔلُونَكَ عَنِ ٱلْأَنفَالِ قُلِ ٱلْأَنفَالُ لِلَّهِ وَٱلرَّسُولِ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَصْلِحُوا۟ ذَاتَ بَيْنِكُمْ وَأَطِيعُوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥٓ إِن كُنتُم مُّؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్ ఫాల్) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "విజయధనం అల్లాహ్ ది మరియు ఆయన సందేశహరునిది." కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.