وَإِذَا لَمْ تَأْتِهِم بِـَٔايَةٍ قَالُوا۟ لَوْلَا ٱجْتَبَيْتَهَا قُلْ إِنَّمَآ أَتَّبِعُ مَا يُوحَىٰٓ إِلَىَّ مِن رَّبِّى هَٰذَا بَصَآئِرُ مِن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ప్రవక్తా!) నీవు వారికి ఏదైనా సూచనను తేలేక పోయినప్పుడు వారు: "నీవే స్వయంగా దానిని ఎందుకు (కల్పించుకొని) తేలేదు?" అని అంటారు. వారితో ఇలా అను: "నేను కేవలం నా ప్రభువు తరఫు నుండి నాకు పంప బడే సందేశాన్ని (వహీని) మాత్రమే అనుసరించేవాడను.[1] ఇందు (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి."[2]