وَسْـَٔلْهُمْ عَنِ ٱلْقَرْيَةِ ٱلَّتِى كَانَتْ حَاضِرَةَ ٱلْبَحْرِ إِذْ يَعْدُونَ فِى ٱلسَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ لَا تَأْتِيهِمْ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا۟ يَفْسُقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సముద్ర తీరము నందున్న ఆ నగర (వాసులను) గురించి వారిని అడుగు; వారు శనివారపు (సబ్త్) ధర్మాన్ని ఉల్లంఘించేవారు! ఆ శనివారం (సబ్త్) రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు (సబ్త్) ధర్మం పాటించని రోజు (చేపలు) వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురిచేశాము.[1]