يَوْمَ يَقُولُ ٱلْمُنَٰفِقُونَ وَٱلْمُنَٰفِقَٰتُ لِلَّذِينَ ءَامَنُوا۟ ٱنظُرُونَا نَقْتَبِسْ مِن نُّورِكُمْ قِيلَ ٱرْجِعُوا۟ وَرَآءَكُمْ فَٱلْتَمِسُوا۟ نُورًا فَضُرِبَ بَيْنَهُم بِسُورٍ لَّهُۥ بَابٌۢ بَاطِنُهُۥ فِيهِ ٱلرَّحْمَةُ وَظَٰهِرُهُۥ مِن قِبَلِهِ ٱلْعَذَابُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులతో ఇలా అంటారు:[1] "మీరు మా కొరకు కొంచెం వేచి ఉండండి, మేము మీ వెలుగు నుండి కొంచెం తీసుకుంటాము."[2] వారితో ఇలా అనబడుతుంది: "మీరు వెనుకకు మరలి పొండి, తరువాత వెలుగు కొరకు వెదకండి!" అప్పుడు వారి మధ్య ఒక గోడ నిలబెట్టబడుతుంది. దానికి ఒక ద్వారముంటుంది, దాని లోపలి వైపు కారుణ్యముంటుంది[3] మరియు దాని బయటవైపు శిక్ష ఉంటుంది.[4]