لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ وَلِلنِّسَآءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ نَصِيبًا مَّفْرُوضًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadపురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; [1] అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం.