caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 19

మదీనా · అవతరణ క్రమం 92 · 4:19

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا۟ ٱلنِّسَآءَ كَرْهًا وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا۟ بِبَعْضِ مَآ ءَاتَيْتُمُوهُنَّ إِلَّآ أَن يَأْتِينَ بِفَٰحِشَةٍ مُّبَيِّنَةٍ وَعَاشِرُوهُنَّ بِٱلْمَعْرُوفِ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰٓ أَن تَكْرَهُوا۟ شَيْـًٔا وَيَجْعَلَ ٱللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప[1]. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70