خَلَقَكُم مِّن نَّفْسٍ وَٰحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلْأَنْعَٰمِ ثَمَٰنِيَةَ أَزْوَٰجٍ يَخْلُقُكُمْ فِى بُطُونِ أُمَّهَٰتِكُمْ خَلْقًا مِّنۢ بَعْدِ خَلْقٍ فِى ظُلُمَٰتٍ ثَلَٰثٍ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَأَنَّىٰ تُصْرَفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. [1] మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) పశువులను పుట్టించాడు. [2] ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. [3] ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?