caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-A'raaf, ఆయత్ 73

మక్కా · అవతరణ క్రమం 39 · 7:73

وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَٰلِحًا قَالَ يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُۥ قَدْ جَآءَتْكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ هَٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمْ ءَايَةً فَذَرُوهَا تَأْكُلْ فِىٓ أَرْضِ ٱللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక సమూద్ జాతి వారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను పంపాము[1]. అతను వారితో! "నా జాతి సోదరులారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. వాస్తవానికి, మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సూచన వచ్చింది. ఇది అల్లాహ్ మీకు ఒక అద్భుత సూచనగా పంపిన ఆడ ఒంటె. కావున దీనిని అల్లాహ్ భూమిపై మేయటానికి వదలిపెట్టిండి. మరియు హాని కలిగించే ఉద్దేశంతో దీనిని ముట్టుకోకండి. ఆలా చేస్తే మిమ్మల్ని బాధాకరమైన శిక్ష పట్టుకుంటుంది.[2]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70