كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَٱلْأَحْزَابُ مِنۢ بَعْدِهِمْ وَهَمَّتْ كُلُّ أُمَّةٍۭ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ وَجَٰدَلُوا۟ بِٱلْبَٰطِلِ لِيُدْحِضُوا۟ بِهِ ٱلْحَقَّ فَأَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి పూర్వం గడిచిన నూహ్ జాతి వారూ మరియు వారి పిదప వచ్చిన ఇతర వర్గాల వారు కూడా (తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. మరియు ప్రతి సమాజం వారు తమ సందేశహరుణ్ణి నిర్భంధించటానికి ప్రయత్నాలు చేశారు. మరియు అసత్యంతో సత్యాన్ని ఖండించటానికి వాదులాడారు; కావున చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూశారా! నా శిక్ష ఎలా ఉండిందో!