caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 23

మదీనా · అవతరణ క్రమం 92 · 4:23

حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَٰتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَٰتُكُمْ وَعَمَّٰتُكُمْ وَخَٰلَٰتُكُمْ وَبَنَاتُ ٱلْأَخِ وَبَنَاتُ ٱلْأُخْتِ وَأُمَّهَٰتُكُمُ ٱلَّٰتِىٓ أَرْضَعْنَكُمْ وَأَخَوَٰتُكُم مِّنَ ٱلرَّضَٰعَةِ وَأُمَّهَٰتُ نِسَآئِكُمْ وَرَبَٰٓئِبُكُمُ ٱلَّٰتِى فِى حُجُورِكُم مِّن نِّسَآئِكُمُ ٱلَّٰتِى دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا۟ دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَٰٓئِلُ أَبْنَآئِكُمُ ٱلَّذِينَ مِنْ أَصْلَٰبِكُمْ وَأَن تَجْمَعُوا۟ بَيْنَ ٱلْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు[1]. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70