وَإِبْرَٰهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (జ్ఞాపకం చేసుకోండి!) ఇలాగే ఇబ్రాహీమ్ కూడా తన జాతి వారితో: "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు అర్థం చేసుకోగలిగితే, ఇది మీకు ఎంతో మేలైనది."