وَلَقَدْ ذَرَأْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِّنَ ٱلْجِنِّ وَٱلْإِنسِ لَهُمْ قُلُوبٌ لَّا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَّا يُبْصِرُونَ بِهَا وَلَهُمْ ءَاذَانٌ لَّا يَسْمَعُونَ بِهَآ أُو۟لَٰٓئِكَ كَٱلْأَنْعَٰمِ بَلْ هُمْ أَضَلُّ أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْغَٰفِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటి కంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు.