إِنَّ ٱلَّذِينَ قَالُوا۟ رَبُّنَا ٱللَّهُ ثُمَّ ٱسْتَقَٰمُوا۟ تَتَنَزَّلُ عَلَيْهِمُ ٱلْمَلَٰٓئِكَةُ أَلَّا تَخَافُوا۟ وَلَا تَحْزَنُوا۟ وَأَبْشِرُوا۟ بِٱلْجَنَّةِ ٱلَّتِى كُنتُمْ تُوعَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! [1] వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!