لَّوْ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّٱصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَآءُ سُبْحَٰنَهُۥ هُوَ ٱللَّهُ ٱلْوَٰحِدُ ٱلْقَهَّارُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, [1] తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. [2]